సాక్షి, హైదరాబాద్ : ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పిలుపునిచ్చారు. వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణపై కార్యక్రమాలు చేపట్టాలని, ఈ వేసవి కాలంలో సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని జలమండలి నిర్మించిన థీమ్ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడ జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై, బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జలమండలి రూపొందించిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ థీమ్ పార్కు.. విద్యార్థులు, నగరవాసులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఓఆర్‌ఆర్ గ్రామాల్లో నీటి ఇక్కట్లు రాకుండా చూడాలి